సూపర్‌స్టార్ రజనీకాంత్ మరియు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో రాబోతున్న ‘జైలర్-2’పై మరో సంచలన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే మార్చి నెలలో ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ఈ సీక్వెల్లో రజనీకాంత్‌ను మరింత స్టైలిష్‌గా, మరింత శక్తివంతమైన పాత్రలో చూపించనున్నారని చిత్రబృందం చెప్పుకుంటోంది. మొదటి భాగానికి తగ్గట్టుగా కథ, ప్రెజెంటేషన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోయినా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో నెల్సన్ ముందుకు వెళ్తున్నారని టాక్. చిత్ర షూటింగ్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
2023 ఆగస్టు 10న విడుదలైన జైలర్ మూవీ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచాయి.
‘ఇది సినిమా కాదు బ్రదర్’.. – పవన్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్