‘డింగా డింగా’.. ఉగాండాను వ‌ణికిస్తున్న మహమ్మారి

'డింగా డింగా'.. ఉగాండాను వ‌ణికిస్తున్న మహమ్మారి

ఉగాండాలో బుండిబుగ్యో జిల్లాలో ఓ వింత వ్యాధి భ‌య‌పెడుతోంది. ఇది ముఖ్యంగా మహిళలు, బాలికల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. డింగా డింగా ఫీవర్ అనే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 400 మందికి పైగా ప్రభావితమయ్యారని ఉగాండా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే, సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు మరణాలు నమోదవ్వలేదు.

డింగా డింగా ఫీవర్ లక్షణాలు
ఈ వ్యాధి ప్రభావంతో శరీరంలో తీవ్ర‌మైన వణుకు మొదలవుతుంది. చేతులు, కాళ్లు ఇలా వణుకుతుండటం వల్ల వారికి నడవడం కూడా కష్టమవుతుంది. ఈ వణుకు వ్యాధిసోకిన వారు “డ్యాన్స్ చేస్తున్నట్లు” కనిపించేలా చేస్తుంది. వ్యాధి సోకిన‌వారికి జ్వ‌రం, తలనొప్పి, దగ్గు, ముక్కు కారటం, శరీర నొప్పులు ఉంటాయి.

2023 ప్రారంభంలో ఈ వ్యాధిని మొదటిసారిగా గుర్తించారు. వ్యాధి గురించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ, దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆరోగ్య నిపుణులు 1518లో ఫ్రాన్స్‌లో ప్రబలిన ‘డ్యాన్సింగ్ ప్లేగు’తో ఈ వ్యాధిని పోలుస్తున్నారు. అప్పుడు కూడా బాధితులు అనియంత్రిత వణుకుతో రోజుల తరబడి బాధపడ్డారు, ఇది మరణాలకు కూడా దారి తీసింది.

బాధితురాలి అనుభవం
తాజాగా డింగా డింగా వ్యాధి నుంచి కోలుకున్న ఓ 18 ఏళ్ల బాధితురాలు మాట్లాడుతూ.. “నాకు చాలా బలహీనంగా అనిపించింది. నడవడానికి ప్రయత్నించినప్పుడు నా కంట్రోల్‌లో ఉండటం లేదు. కాళ్లు, చేతులు నా నియంత్ర‌ణ‌లో లేవు. వారం రోజులు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందాను. ఇప్పుడు బాగున్నాను” అని చెప్పింది.

Join WhatsApp

Join Now

Leave a Comment