రామ్ చరణ్ ‘పెద్ది’ బజ్ నెక్స్ట్ లెవల్..

రామ్ చరణ్ ‘పెద్ది’ బజ్ నెక్స్ట్ లెవల్..

రామ్ చరణ్ (Ram Charan) ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi) సినిమా వేసవిలో గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో బజ్ నెక్స్ట్ లెవల్ కి చేసుకుంది. బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు (Venkata Satish Kilaru) నిర్మించిన పెద్దిలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman) స్వరపరిచిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, బ్లాక్ బస్టర్ ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి కి ట్రెమండస్ రెస్పాన్స్ తో రికార్డులను బద్దలు కొట్టాయి.

ఎక్సయిట్మెంట్ ని మరింతగా పెంచుతూ మార్చి 2న రెండవ సింగిల్ ‘రైయ్ రైయ్ రాయ్ రా రా’ విడుదలతో బజ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళబోతోంది. సాంగ్ పోస్టర్‌లో రామ్ చరణ్ మ్యాసీ అవతార్ లో కనిపిస్తున్నారు. రగ్గడ్ దుస్తులు, చిరిగిన జుట్టు, గడ్డం, భుజంపై పెద్ద సుత్తిని వేలాడదీసుకుని, మెరిసే చిరునవ్వుతో కనిపిస్తున్నారు, బ్యాక్ డ్రాప్ లో గందరగోళం చెలరేగుతున్నప్పటికీ, ప్రజలు అతని చుట్టూ పరిగెత్తుతున్నారు. AR రెహమాన్ పవర్ ఫుల్ సంగీతం ఇప్పటికే సంచలనం సృష్టించింది. పెద్ది ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న మాస్ స్పెషాలిటీలలో ఒకటిగా రాబోతోంది. ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment