అల్లు అర్జున్ నటనపై పూనమ్ కౌర్ ప్రశంసలు

అల్లు అర్జున్ నటనపై పూనమ్ కౌర్ ప్రశంసలు

‘పుష్ప-2’ సినిమాపై హీరోయిన్ పూనమ్ కౌర్ తాజాగా సోషల్ మీడియా వేదిక‌గా త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. పుష్ప‌-2 సినిమాలో అల్లు అర్జున్ న‌ట‌న‌ను అప్రిషేట్ చేశారు. ఇంత అద్భుత‌మైన చిత్రాన్ని అందించినందుకు మూవీ మేక‌ర్స్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ఆమె ట్వీట్ చేశారు.

“మొత్తానికి పుష్ప-2 మూవీ చూశాను. గంగమ్మ జాతర ఎపిసోడ్ చాలా న‌చ్చింది. తెలంగాణలో సమ్మక్క సారలక్క జాతర ఎలా ప్రత్యేకమో, ఈ సినిమాలో అంత బాగా గంగ‌మ్మ జాత‌ర ఎపిసోడ్‌ చూపించారు. మన సాంప్ర‌దాయాలు, సంస్కృతులను అద్భుతంగా ప్రతిబింబించారు. అల్లు అర్జున్ పాత్రలో మరెవ్వరూ ఇంత గొప్పగా నటించలేరు” అని కొనియాడారు. పూనమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment