నాని–శ్రీకాంత్ కాంబినేషన్ మరోసారి హిట్

నాని–శ్రీకాంత్ కాంబినేషన్ మరోసారి హిట్

Summarize with AI

టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది నేచురల్ స్టార్ నాని (Nani) – దర్శకుడు శ్రీకాంత్ (Srikanth Odela) కాంబినేషన్.‘దసరా’తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించిన ఈ జంట, ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ (‘The Paradise’) కోసం మళ్లీ చేతులు కలిపింది. అయితే తాజాగా శ్రీకాంత్ ఓదెల చేసిన ఎమోషనల్ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. నాని తనపై ఉంచిన అపారమైన నమ్మకం ప్రతి క్షణం తనను మరింత బాధ్యతగా, కష్టపడేలా చేస్తోందని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు. “నువ్వు ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అనగానే, అది ‘నిన్ను నేను నమ్ముతున్నాను’ అన్నట్టుగా వినిపిస్తుంది” అంటూ దర్శకుడు తన మనసులోని మాటను పంచుకున్నారు.

ఇక ఈ సినిమా కోసం నాని కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా కొన్ని రూల్స్ బ్రేక్ చేశానని శ్రీకాంత్ వెల్లడించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. వర్కింగ్ డేస్ ప్యాటర్న్ నుంచి రిలీజ్ డేట్ ప్లానింగ్ వరకూ మార్పులు చేసినప్పటికీ, నాని చూపుతున్న నమ్మకం తనపై ఒత్తిడికన్నా బాధ్యతను పెంచుతోందని తెలిపారు. ఈ ట్వీట్‌తో నాని–శ్రీకాంత్ మధ్య ఉన్న బాండింగ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘దసరా’ (Dasara)ను మించే మాస్ యాక్షన్ డ్రామాగా ‘ది ప్యారడైజ్’ రూపొందుతోందన్న సంకేతాలు ఈ పోస్ట్‌తో స్పష్టమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment