భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ జంట వివాహం నేడు ఉదయ్‌పూర్‌లోని రఫల్స్ హోటల్‌లో ఘనంగా జరుగనుంది.
ప్రముఖుల సమక్షంలో..
పీవీ సింధు వివాహ వేడుకలో క్రీడా, రాజకీయ, సినిమా రంగాల ప్రముఖులు హాజరవుతారని అంచనా. రాజస్థానీ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి వేడుకను ప్రత్యేకంగా మార్చారు.
హైదరాబాద్‌లో రిసెప్షన్
పెళ్లి వేడుక అనంతరం, మంగళవారం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సింధు అభిమానులు, సన్నిహితులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి తన పెళ్లి ఆహ్వానపత్రిక అందజేసిన విషయం తెలిసిందే.