వెండితెరపై కోట్లాది అభిమానులను అలరించే చిరంజీవి జీవితంలో నిజమైన హీరో మాత్రం తన భార్య సురేఖ అని ఆయన మరోసారి వెల్లడించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానులను మాత్రమే కాదు, సాధారణ ప్రజలను కూడా కదిలిస్తోంది.
44 ఏళ్ల బంధానికి గౌరవం
తమ 44 సంవత్సరాల వైవాహిక జీవితం గురించి చిరంజీవి భావోద్వేగ పోస్ట్ చేశారు. తాను షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా ఇంటి బాధ్యతలను పూర్తిగా భుజాన వేసుకుని కుటుంబాన్ని కాపాడింది సురేఖే అని చెప్పారు. తాను కెమెరా ముందు మెరవడానికి అసలు కారణం ఆమేనని పేర్కొన్నారు.
కుటుంబాన్ని ఏకం చేసి నిలబెట్టిన బలమైన పునాది ఆమె అని, తన విజయానికి వచ్చిన క్రెడిట్‌లో పెద్ద భాగం ఆమెదేనని ఆయన అన్నారు. తన తల్లిదండ్రులు, తోబుట్టువులను కోడలిగా కాకుండా సొంత కూతురిలా చూసుకుని అందరి మనసులు గెలుచుకుందని గుర్తుచేసుకున్నారు.
తన జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటానని చేసిన ఈ వ్యాఖ్యలు దాంపత్య బంధంలో గౌరవం ఎంత ముఖ్యమో చూపిస్తున్నాయి. పుట్టినరోజు, పెళ్లి రోజు దగ్గరగా రావడంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







