తైవాన్ పార్లమెంట్లో ఉద్రిక్తత.. స్పీకర్ కుర్చీ కోసం ఘర్షణ

తైవాన్ పార్లమెంట్లో ఉద్రిక్తత.. స్పీకర్ కుర్చీ కోసం ఘర్షణ

తైవాన్ పార్లమెంట్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ఎంపీలు రాత్రిపూట భవనంలోకి చొరబడి, స్పీకర్ కుర్చీని ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఈ ఘటనను గమనించిన ప్రత్యర్థి పార్టీ ఎంపీలు, వారిని అడ్డుకునేందుకు ముందు వచ్చారు. ఈ క్రమంలో రెండు పక్షాల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకుంది.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఈ గొడవలో పలువురు ఎంపీలకు గాయాలు అయ్యాయి. రాజకీయ అజెండాలకు సంబంధించి పార్లమెంట్లో మామూలు చర్చల స్థానంలో ఇలాంటి హైడ్రామాలు జరగడం విచారకరం అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. బిల్లుల ఆమోదం విష‌యంలోనే అధికార‌, విప‌క్ష పార్టీ ఎంపీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment