అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వీట్ వార్నింగ్‌

అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వీట్ వార్నింగ్‌

అభిమానుల‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలో రోడ్ల నిర్మాణ ప‌నుల శంకుస్థాప‌న‌కు హాజ‌రైన ప‌వ‌న్‌.. గిరిజ‌నుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ప్ర‌సంగానికి అడ్డుత‌గులుతున్న అభిమానుల తీరుతో విస్తుపోయిన ప‌వ‌న్‌, వారికి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

ప‌వ‌న్ ఏమ‌న్నారంటే..
ఓజీ ఓజీ అని అర‌వ‌కండి. న‌న్ను ప‌నిచేసుకోనివ్వండి. నేను డిప్యూటీ సీఎంను అయినా.. ఇంకా సీఎం సీఎం అని అరుస్తున్నారు. డిప్యూటీ సీఎం స‌రిపోలేదేమో.. హీరోల‌కు జేజేలు కొట్టండి.. కానీ మీ జీవితాల‌పై కూడా దృష్టిపెట్టండి. మాట్లాడితే అన్నా.. మీసం తిప్పు, మీసం తిప్పు అంటున్నారు. నేను మీసం తిప్పితేనో, ఛాతి మీద కొట్టుకుంటేనో రోడ్లు రావు. ప్ర‌ధాని, సీఎంల ద‌గ్గ‌ర‌కు వెళ్లి మాట్లాడితేనే రోడ్లు ప‌డ‌తాయి. అందుకే న‌న్ను ప‌నిచేయ‌నివ్వండి. అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment