జనసేన ఎమ్మెల్యే రాసలీలలు.. వీడియో వైరల్ (Video)

జనసేన ఎమ్మెల్యే రాసలీలలు.. వీడియో వైరల్ (Video)

Summarize with AI

మ‌హిళ‌ల (Women) జోలికి వ‌స్తే తాట‌తీస్తాం, అంతుచూస్తాం అని వార్నింగ్‌లు ఇచ్చే జ‌న‌సేన పార్టీ (Jana Sena Party)కి చెందిన ఓ ఎమ్మెల్యేకి సంబంధించిన రాస‌లీలల వీడియో (Sexual acts Video)సంచ‌ల‌నంగా మారింది. రైల్వే కోడూరుకు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar – MLA) న్యూడ్ వీడియో బ‌య‌ట‌ప‌డింది. దుస్తులు విపి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఏడాదిన్నర కాలంగా ఎమ్మెల్యే లైంగికంగా వేధించాడ‌ని, బెదిరింపులకు పాల్పడ్డారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో జ‌న‌సేన పార్టీ ప్ర‌తిష్ట‌ను దిగజార్చుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

బాధితురాలి వివరాల ప్రకారం… ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్, మొదట పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పి తనను లోబర్చుకున్నారని బాధితులు వెల్ల‌డించింది. అనంతరం తరచూ ఫోన్ కాల్స్ చేస్తూ, దుస్తులు లేకుండా వీడియో కాల్ చేయాలని, తన కోరికలు తీర్చాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. కోరికలు నెరవేర్చకపోతే తన మూడేళ్ల కుమారుడిని చంపేస్తానని బెదిరించినట్లు, “నేను ఎమ్మెల్యేను… నాకేమీ కాదు” అంటూ భయపెట్టినట్లు బాధిత మహిళ తెలిపింది. భర్తకు విడాకులు ఇవ్వాలని కూడా ఒత్తిడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదే సమయంలో ఎమ్మెల్యేతో అక్రమ సంబంధం వల్ల గర్భం దాల్చిన తనకు బలవంతంగా అబార్ష‌న్ చేయించారని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయం భర్తకు తెలియడంతో అసలు విషయం బయటపడిందని తెలిపింది. అనంతరం తన భర్తకు కూడా ఎమ్మెల్యే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపింది.

ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం నెలకొంది. మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు ఈ ఘటనపై స్పందిస్తూ… ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ ఆరోపణలపై జనసేన పార్టీ, అలాగే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment