తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు మరో పెద్ద షాక్ తగిలింది. జర్నలిస్టుపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని మోహన్ బాబు కోర్టును విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేసిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
రాచకొండ సీపీ ప్రకటన
మోహన్ బాబు కేసు గురించి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఆయనపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు వెల్లడించారు. “మోహన్ బాబు అరెస్టులో ఎటువంటి ఆలస్యం ఉండదని స్పష్టం చేస్తున్నాం. ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. ఈనెల 24వ తేదీ వరకు సమయం కోరారు. ఆ తర్వాత నోటీసులకు స్పందించకపోతే ఆయనను అరెస్ట్ చేస్తాం” అని సీపీ స్పష్టం చేశారు.
మోహన్ బాబు పరిస్థితి
ఈ కేసులో మోహన్ బాబు మరింత చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు కూడా 24వ తేదీ వరకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. దీనితో, ఆ తేదీ తరువాత కేసు మరింత ఉత్కంఠతను సంతరించుకునే అవకాశం ఉంది.