73 మంది రాజ్యసభ ఎంపీల పదవీ విరమణ.. రాష్ట్రాల్లో రాజకీయ హడావుడి

73 మంది రాజ్యసభ ఎంపీల పదవీ విరమణ.. ఆ రాష్ట్రాల్లో రాజకీయ హడావుడి

ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 73 మంది రాజ్యసభ సభ్యులు (73 Rajya Sabha Members) పదవీ విరమణ చేయనున్నట్లు రాజ్యసభ సచివాలయం (Rajya Sabha Secretariat) వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక బులిటెన్ విడుదలైంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 22 రాష్ట్రాల నుంచి ఎంపీల పదవీ కాలం ముగియనుంది. ఈ పరిణామంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయంగా కొత్త సమీకరణలు, ఎన్నికల హడావుడి మొదలయ్యే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా కీలక రాష్ట్రాల్లో రాజ్యసభ సీట్ల భర్తీపై పార్టీల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి వైసీపీ(YSRCP)కి చెందిన అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు టీడీపీ(TDP) సభ్యుడు సానా సతీష్ బాబు పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ (Telangana) నుంచి బీఆర్ఎస్(BRS) సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ (Congress) నుంచి కేశవరావు రాజీనామాతో జరిగిన ఉపఎన్నికలో ఎన్నికైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పదవీ కాలం ముగియనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment