రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) మరోసారి తన స్టార్‌డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద రుజువు చేశాడు. మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ హారర్ కామెడీ ‘ది రాజా సాబ్’(The Raja Saab) మిక్స్‌డ్ నుంచి నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ ఓపెనింగ్ డే (Opening Day) కలెక్షన్లలో (Collections) దుమ్మురేపింది. తొలి రోజు భారత్‌లో సుమారు రూ.65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్ల మార్క్‌ను దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు కావడం విశేషం. ప్రీమియర్ షోల ద్వారానే రూ.8 కోట్లకు పైగా రావడం ప్రభాస్ క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది.
విదేశీ మార్కెట్లలోనూ ‘ది రాజా సాబ్’ అదరగొట్టింది. ఓవర్సీస్‌లో రూ.25 నుంచి రూ.30 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా రావడం ట్రేడ్‌ను ఆశ్చర్యపరిచింది. ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’ స్థాయిలో కాకపోయినా, తొలి రోజు ఈ రేంజ్ ఓపెనింగ్‌కు పూర్తిగా ప్రభాస్ స్టార్ పవర్‌నే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నెగటివ్ టాక్ ఉన్నా, ఓపెనింగ్ డే కలెక్షన్లతో ‘ది రాజా సాబ్’ మరోసారి ప్రభాస్ మార్కెట్ ఎంత బలమైనదో చూపించింది.








