మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం మాస్ స్వింగ్‌లో దూసుకుపోతున్నారు. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న చిరు, దీని తర్వాత తన 158వ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లి తో చిరు మరోసారి కలవడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తాజాగా ఈ సినిమాలో చిరుకు జోడిగా పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ, ఇప్పుడు ఏకంగా ప్రపంచ సుందరి పేరు వినిపించడం సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది.
ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవికి జంటగా ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) నటించనున్నట్లు వినిపిస్తున్న వార్త సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. క్యాస్టింగ్ పరంగానే కాకుండా టెక్నికల్‌గా కూడా ఈ సినిమా సెన్సేషన్‌గా మారనుందని టాక్. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక పవర్‌ఫుల్ క్యామియోలో కనిపించనున్నారని సమాచారం.
కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సాగే రస్టిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా బాబీ ఈ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ చిరును వైల్డ్ లుక్‌లో చూపించబోతున్నట్లు హింట్ ఇవ్వగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభమై మార్చి 2026 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.








