కొండగట్టు కి పవన్ కళ్యాణ్

కొండగట్టు కి పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలోని జగిత్యాల జిల్లా ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఆలయానికి చేరుకున్న పవన్‌కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అంజన్నకు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్‌కు అర్చకులు వేదాశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా పవన్ భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకోవడం భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది.

ఈ పర్యటనలో భాగంగా టీటీడీ నిధులు రూ.35.19 కోట్లతో భక్తుల వసతి కోసం నిర్మించనున్న 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండపానికి పవన్ కళ్యాణ్ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి భూమిపూజ చేసారు. అనంతరం నాచుపల్లి శివారులోని ఓ రిసార్ట్‌లో జనసేన కార్యకర్తలతో సమావేశమై, మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణం కానున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో కొండగట్టులో భద్రతా ఏర్పాట్లు చేపట్టగా, జనసేన కార్యకర్తలు వచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment