హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur) ట్వీట్ (Tweet) చేసిందంటే కొందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయనడంలో సందేహం లేదు. అందుకు కారణం కూడా ఉంది. తాజాగా ఆమె డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram Srinivas) మీద విరుచుకుపడింది. త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పూనమ్ కౌర్ ఇటీవల చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. మహిళలను హింసించి (Abuse), మానసికంగా వేధించి (Mentally Harass), ఏమీ తెలియనట్లు తిరిగే వ్యక్తులు నిజంగా దుర్మార్గులని (Cruel People) ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి వారికి మద్దతుగా నిలిచే మీడియా, అలాగే బాధ్యతను ప్రశ్నించని సంస్థలే మహిళలపై వేధింపులు కొనసాగడానికి కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.
తన వ్యాఖ్యల్లో ‘మా’ (MAA) అసోసియేషన్‌ను కూడా పూనమ్ కౌర్ ప్రస్తావించారు. చిన్న చిన్న అంశాలపై వెంటనే స్పందించే వారు, పెద్ద అన్యాయాలు జరుగుతున్నప్పుడు మాత్రం జవాబుదారీతనం కోరడంలో విఫలమవుతున్నారని ఆమె విమర్శించారు. మహిళల పట్ల జరుగుతున్న దుర్వినియోగానికి ఇదే ప్రధాన కారణమని పూనమ్ కౌర్ తన పోస్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
త్రివిక్రమ్‌కు వ్యతిరేకంగా పూనమ్ కౌర్ చాలా కాలంగా పోరాటం చేస్తూ వస్తున్నారు. గతంలో ‘మా’ అసోసియేషన్‌కు ఆమె ఫిర్యాదు కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే తన ఫిర్యాదుపై కనీసం త్రివిక్రమ్‌ను పిలిచి విచారించలేదని పూనమ్ కౌర్ గతంలోనే ఆరోపణలు చేశారు. ఈ అంశం అప్పట్లో కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఇండస్ట్రీలోని పెద్దల అండదండలతో త్రివిక్రమ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, వారితో పెట్టుకోవడం ఎందుకనే తన పోరాటాన్ని పట్టించుకోలేదని గతంలో పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయినా వివిధ రూపాల్లో తన నిరసనను కొనసాగిస్తూనే ఉన్న పూనమ్ కౌర్ వ్యాఖ్యలపై ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై ‘మా’ అసోసియేషన్, తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.








