సంక్రాంతి ట్రాఫిక్ కోసం మంత్రి ప్రత్యేక ఆదేశాలు

సంక్రాంతి ట్రాఫిక్ కోసం మంత్రి ప్రత్యేక ఆదేశాలు

సంక్రాంతి పండుగ (Sankranti Festival) సమయంలో రాష్ట్ర రోడ్లు, నేషనల్ హైవేలపై ట్రాఫిక్ సమస్యలను (Traffic Issues) నివారించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ – విజయవాడ హైవే పై జనవరి 8వ తేదీ నుంచి వాహన రద్దీ ఎక్కువ ఉండొచ్చు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) కూడా ప్రత్యేక దృష్టి సారించి, రోజుకు లక్ష వాహనాలు ప్రయాణించే వీధులలో సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పండుగ సమయంలో రోడ్డు పనులు, లేన్ మూసివేతలు తక్షణం నిలిపివేయాలని, అత్యవసర పనులు మాత్రమే రాత్రి సమయంలో చేయాలని సూచించారు.

రాత్రి వెలుతురు, హై-విజిబిలిటీ బారికేడ్లు, ట్రాఫిక్ బోర్డులు, రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు వంటి అన్ని అవసరమైన భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలన్నారు. అదనపు ట్రాఫిక్ పోలీసులు, రూట్ పేట్రోల్ వాహనాలు, క్రేన్లు, అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అన్ని రహదారి ఘటనలను ప్రత్యేక ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. ఈ సమీక్షలో NHAI, MoRTH, పోలీస్, ఆర్‌ అండ్‌ బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు, పండుగ సమయంలో రోడ్ల భద్రత, ట్రాఫిక్ సమన్వయంపై చర్చ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment