రీల్ కోసం రైలు కిందకు.. చివరకు కటకటాలకు

రీల్ కోసం రైలు కిందకి వెళ్లాడు..

యూపీ (Uttar Pradesh) రాష్ట్రంలోని కొత్వాలీ ప్రాంతంలో రీల్స్ పిచ్చి (Reels craze) ఓ యువకుడిని ప్రమాదం అంచుకు తీసుకెళ్లింది. అజయ్ రాజ్బర్ (Ajay Rajbhar) అనే యువకుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో వేగంగా వస్తున్న రైలు(Train) కింద పడుకుని వీడియో చిత్రీకరించాడు. ఈ ఘటనను అతని స్నేహితులు రికార్డు చేయగా, ఆ రీల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాపాయం ఉన్న ఈ చర్యపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రీల్ వైరల్ కావడంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టి అజయ్ రాజ్బర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే భద్రతకు భంగం కలిగించేలా, ప్రజల్లో తప్పు సందేశం పంపేలా వ్యవహరించినందుకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి ప్రమాదకర రీల్స్ యువత ప్రాణాలతో చెలగాటం ఆడే పరిస్థితికి దారి తీస్తున్నాయని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియా లైక్స్ కోసం ఇలాంటి పనులు చేయవద్దని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment