మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా (Bucchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddhi) నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు (Venkata Satish Killaru) నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో వర్సటైల్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇందులో ఆయన పోషిస్తున్న ‘అప్పలసూరి’ (Appalasuri) పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సాధారణంగా స్టైలిష్ విలన్ లేదా క్లాస్ పాత్రల్లో కనిపించే జగపతి బాబు, ఈసారి చెదిరిన జుట్టు, ఘనమైన గడ్డం, దారంతో కట్టిన విరిగిన కళ్లజోడుతో పూర్తిగా రా అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమాలో అప్పలసూరి పాత్ర అత్యంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందనే అంచనాలు మరింత పెరిగాయి.
ఈ సినిమాలో బోమన్ ఇరానీ కూడా కీలక పాత్రలో నటిస్తూ ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఆయన పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడిస్తోంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ (హీరోయిన్), శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికీరి చికీరి’ పాట చార్ట్‌బస్టర్‌గా నిలవగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 27, 2026న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.








