తమిళ సూపర్‌స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) చెన్నై విమానాశ్రయంలో (Chennai Airport) జారిపడిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇటీవల తన లాస్ట్ సినిమా ‘జననాయగన్’ (Jananayagan) ఆడియో లాంచ్ కోసం చిత్ర బృందంతో కలిసి మలేషియా (Malaysia) వెళ్లిన విజయ్.. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి ప్రత్యేక విమానంలో చెన్నైకి తిరిగి వచ్చారు. ఆయన రాక సమాచారం ముందే తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు.
విజయ్ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే విజయ్ ఒక్కసారిగా జారిపడి కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనకు అండగా నిలిచి కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భావోద్వేగానికి గురైన అభిమానులు
మలేషియాలో జరిగిన ‘జననాయగన్’ ఆడియో లాంచ్ వేడుకలో విజయ్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి. ఇది తన 69వ సినిమా అని, సినిమాలకు (Films) గుడ్‌బై (Goodbye) చెబుతున్నానని చెబుతూ విజయ్ కన్నీళ్లు పెట్టుకోవడం అప్పట్లో అందరినీ కదిలించింది. తన చివరి సినిమా ఇదేనంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలను అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆ భావోద్వేగాలే ఆయన చెన్నైకి వస్తున్నారని తెలిసిన వెంటనే భారీ సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకునేలా చేశాయని తెలుస్తోంది.
కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇంటికి
విమానాశ్రయంలో జరిగిన ఘటన అనంతరం భద్రతా సిబ్బంది విజయ్ను అత్యంత కట్టుదిట్టమైన రక్షణ మధ్య కారులోకి ఎక్కించారు. అక్కడి నుంచి ఆయన నివాసానికి చేరుకునే వరకు పూర్తి ఎస్కార్ట్ అందించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో విజయ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
‘జననాయగన్’ సినిమా విశేషాలు
‘జననాయగన్’ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమత బైజు హీరోయిన్లుగా నటిస్తుండగా, బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అనిరుద్ రవిచంద్రన్ స్వరపరిచిన మూడు పాటలు ఇప్పటికే చార్ట్బస్టర్లుగా నిలిచాయి. పొంగల్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Shocking after #NidhhiAgerwal from #TheRajaSaab – Actor Vijay briefly stumbled & fell while entering his car amid an overwhelming crowd on his return to Chennai, after attending the music launch in Malaysia.#Chennai |#TVKVijay | #Vijay I #ThalapathyVijaypic.twitter.com/ponfanrsSb
— Pan India Review (@PanIndiaReview) December 28, 2025








