ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా, బొలెరో నుజ్జునుజ్జు

ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా, బొలెరో నుజ్జునుజ్జు

Summarize with AI

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రాంపూర్ జిల్లా గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడీ గేట్ కూడలి సమీపంలో ఆదివారం సాయంత్రం గడ్డి లోడ్‌తో వెళ్తున్న లారీ (Lorry) అదుపు తప్పి పక్కనే వెళ్తున్న బొలెరో వాహనంపై (Bolero Vehicle) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ ఫిరాసత్ (Firasat) (54) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గుజర్‌టోలా గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బొలెరో పక్కన వెళ్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ, అతని బైక్ దెబ్బతింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, అంబులెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. జేసీబీ క్రేన్ సాయంతో లారీ కింద చిక్కుకున్న బొలెరో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లో జంక్షన్ వద్ద లారీ డివైడర్ ఎక్కి ఒక్కసారిగా బొలెరోపై బోల్తా పడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment