‘దసరా’, ‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని (Natural Star Nani).. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్స్ (Big-Budget Projects)తో బిజీగా ఉన్నాడు. తాజాగా నాని కొత్త సినిమా విషయానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్బ్యా (Sithara Entertainments)నర్‌లో నాని కొత్త సినిమా చేయబోతున్నారని చర్చలు కొనసాగుతున్నాయి.
ఈ అన్‌టైటిల్డ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ, దర్శకుడి ఎంపిక ఇప్పటికే ఫైనల్ అయి, ఈ సినిమా 2026 రెండో సగంలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో సితార నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నానితో సినిమా దాదాపు ఫిక్స్ అయిపోయింది. అన్ని అనుకున్నట్లు జరిగితే 2026 రెండో సగం లో షూటింగ్ ప్రారంభమవుతుంది” అని చెప్పారు.
ప్రస్తుతం నాని ‘ది పారడైస్’ (The Paradise) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఒడెల్ దర్శకత్వంలో రూపొందుతూ, 26 మార్చి 2026న రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్ట్ తరువాత నాని సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు, ఇది కూడా 2026లోనే విడుదలవుతుందని టాక్. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రాజెక్ట్ 2026 చివరి సగంలో షూటింగ్ ప్రారంభం అవ్వనుంది. అన్ని ఫైనల్ అయిన తర్వాత, సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.








