ఎగ్జామ్ పేపర్‌లో వివాదాస్పద ప్రశ్న.. ప్రొఫెసర్ సస్పెండ్!

ఎగ్జామ్ పేపర్‌లో వివాదాస్పద ప్రశ్న.. ప్రొఫెసర్ సస్పెండ్!

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ప్రముఖ విద్యాసంస్థ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం (Jamia Millia Islamia University) తాజాగా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. సెమిస్టర్ పరీక్షల్లో అడిగిన ఒక ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ ప్రశ్న వైరల్ కావడంతో యూనివర్సిటీ యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకుంది.

ఈ వారం ప్రారంభంలో జామియా యూనివర్సిటీలో మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. బీఏ సోషల్ సైన్సెస్ (BA Social Sciences) కోర్సులో భాగంగా ఉన్న ‘భారతదేశంలో సామాజిక సమస్యలు’ (Social Issues in India) అనే పేపర్‌లో 15 మార్కుల ప్రశ్న తీవ్ర దుమారం రేపింది.

“భారతదేశంలో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దారుణాలను వివరించండి” అనే ప్రశ్నను ప్రశ్నాపత్రంలో చేర్చడం పట్ల పలువురు విద్యార్థులు, సామాజిక వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ ప్రశ్నను చూసి విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారని సమాచారం. ఈ వివాదాస్పద ప్రశ్నను ప్రొఫెసర్ వీరేంద్ర బాలాజీ షహరే (Professor Virendra Balaji Shahare) రూపొందించినట్లు యూనివర్సిటీ గుర్తించింది. ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.

దీంతో అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రత్యేకంగా ఒక ఎంక్వైరీ కమిటీ (Inquiry Committee)ని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక వచ్చే వరకు సంబంధిత ప్రొఫెసర్‌ను సస్పెండ్ (Suspension) చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వ్యవహారంపై స్పందించిన జామియా యూనివర్సిటీ యాజమాన్యం, ప్రస్తుతం ప్రొఫెసర్‌పై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది. విచారణ పూర్తయ్యాక తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment