అంబేద్కర్ విగ్రహ శిల్పి మృతి.. కేసీఆర్ సంతాపం

అంబేద్కర్ విగ్రహ శిల్పి మృతి.. కేసీఆర్ సంతాపం

అంబేద్కర్ (Dr. B. R. Ambedkar) 125 అడుగుల విగ్రహ (125-feet statue) రూపశిల్పి, పద్మభూషణ్ రామ్ వాంజీ సుతార్ (Ram Vanji Sutar) మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కె. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao – KCR) ప్రగాఢ సంతాపం ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశానికి గర్వకారణంగా నిలిచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రూపొందించిన రామ్ సుతార్ శిల్పకళా సేవలు అపూర్వమని కేసీఆర్ కొనియాడారు. ప్రముఖుల విగ్రహాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన ఆయన, శిల్పకళా రంగంలో కోహినూర్ వజ్రంలాంటి మహానుభావుడని పేర్కొన్నారు.

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా అంబేద్కర్ స్ఫూర్తి రూపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన రామ్ సుతార్ తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్ తెలిపారు. ఆయన మరణం శిల్పకళా రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. నిండు నూరేళ్ల జీవితాన్ని పరిపూర్ణంగా సాగించి దివంగతులైన రామ్ వాంజీ సుతార్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment