‘జమిలి’ బిల్లు.. లోక్‌స‌భ‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్‌

'జమిలి' బిల్లు.. లోక్‌స‌భ‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్‌

జమిలి బిల్లును జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)కు పంపడంపై లోక్‌స‌భలో చ‌ర్చ జ‌రిగింది. చర్చ అనంతరం స‌భ‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. మొత్తం 369 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇందులో 220 మంది సభ్యులు బిల్లును జేపీసీకి పంపాలని ఓటు వేయ‌గా, 149 మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు.

ఓటింగ్ ప్రక్రియలో కొందరు సభ్యులు స్లిప్పుల ద్వారా తమ ఓటు నమోదు చేసుకున్నారు. స్పీకర్ ఈ ప్రక్రియలో క్రాస్ చెకింగ్‌కు అవకాశం కల్పించారు. మొత్తం 543 మంది సభ్యులున్న లోక్‌స‌భ‌లో కేవలం 369 మంది సభ్యులే ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో పాల్గొనడం గమనార్హం.

కాగా కొన్ని సీట్లలో సాంకేతిక లోపాలు రావడం తో సభ్యులకు స్లిప్పులు(Slips) అందజేశారు. దీంతో మొత్తం ఓటింగ్ ముగిసే సమయానికి ఈ బిల్లుకు మద్దతుగా 269 మంది సభ్యులు నిలవగా.. వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. దీంతో జమిలి బిల్లను ప్రవేశ పెట్టడానికి లోక్ సభ ఆమోదం(Approval of Lok Sabha) తెలిపింది. 

జ‌మిలి ఎల‌క్ష‌న్ బిల్లును జేపీసీకి పంపించ‌డం ద్వారా లోక్‌స‌భ‌లో విస్తృతంగా చ‌ర్చ జ‌ర‌గాలని ప్ర‌ధాని మోదీ భావించారు. జ‌మిలి బిల్లుపై స‌భ‌లో ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ అనంత‌రం స‌భ‌ను 3 గంట‌ల‌కు వాయిదా వేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment