---Advertisement---

టీడీపీలోకి ఆళ్ల నాని? తెలుగు తమ్ముళ్లలో విభేదాలు

టీడీపీలోకి ఆళ్ల నాని? తెలుగు తమ్ముళ్లలో విభేదాలు
---Advertisement---

అధికారం కోల్పోయిన వెంట‌నే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని త్వరలో తెలుగుదేశం పార్టీలో చేర‌బోతున్న‌ట్లుగా స‌మాచారం. రేపు అమరావతిలో పార్టీ పెద్దల సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారట‌. కాగా, ఆళ్ల నాని టీడీపీలో చేరుతార‌న్న వార్త రాగానే తెలుగు త‌మ్ముళ్ల‌లో విభేదాలు మొద‌ల‌య్యాయి.

ఈ నేపథ్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆళ్ల నాని చేరికకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. ఆళ్ల నాని చేరిక టీడీపీ రాజకీయ పరిస్థితుల్లో కొత్త చర్చకు దారి తీసింది. పార్టీలో అగ్రనేతలు ఈ అంశంపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

పోతుల సునీత విష‌యంలోనూ..
వైసీపీ అధికారం కోల్పోయిన వెంట‌నే ఆ పార్టీని వీడిన వారిల్లో పోతుల సునీత కూడా ఉన్నారు. అయితే పోతుల సునీత టీడీపీలోకి రీఎంట్రీ ఇస్తార‌ని అంతా భావిస్తున్న త‌రుణంలో ప‌లాస ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్రంగా వ్య‌తిరేకించారు. పోతుల సునీత ఊస‌ర‌వెల్లి రాజ‌కీయాలు చేస్తార‌ని, ప‌ద‌వుల కోసం మ‌ళ్లీ టీడీపీలో చేరుతున్నార‌ని, ఆమెను పార్టీలో చేర్చుకోవ‌ద్ద‌ని ఖ‌రాఖండిగా చెప్పేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment