‘వారు పార్టీ మారిన‌ట్లు ఆధారాల్లేవ్‌’.. స్పీక‌ర్ నిర్ణ‌యం వివాదాస్ప‌దం

'వారు పార్టీ మారిన‌ట్లు ఆధారాల్లేవ్‌'.. స్పీక‌ర్ నిర్ణ‌యం వివాదాస్ప‌దం

తెలంగాణలో (Telangana) పార్టీ ఫిరాయించిన (Party Defection) ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ (Speaker) గడ్డం ప్రసాద్ (Gaddam Prasad Kumar) నిరాకరించడంతో రాజకీయంగా తీవ్ర చర్చ మొదలైంది. బీఆర్ఎస్(BRS Party) గుర్తుపై గెలిచి, అధికార కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరిన వారిపై ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టం ప్ర‌కారం దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని (No Evidence), వారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని స్పీకర్ తన నిర్ణయంలో స్పష్టం చేశారు.

దీంతో అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్‌లపై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరించడం ద్వారా వారికి ఊరట లభించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు నిరూపించే స్పష్టమైన ఆధారాలు లేవని స్పీకర్ వ్యాఖ్యానించారు.

అయితే, ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పిన దృశ్యాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఆధారాల్లేవని స్పీకర్ చెప్పడం ఆశ్చర్యకరమని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు లాంటిదని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

ఇంత నీచమైన చర్యలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని, భవిష్యత్తులో రాజకీయాలను ఇంకా ఎంత దిగజారుస్తారోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద వివాదానికి దారి తీస్తూ, రాబోయే రోజుల్లో న్యాయపోరాటానికి కూడా కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment