కామెరూన్‌ గ్రీన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు!

కామెరూన్‌ గ్రీన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL) 2026 మినీ వేలంలో అందరూ ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌కు (Cameron Green) భారీ లాభం దక్కింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)(Kolkata Knight Riders – KKR) అతడిని రూ.25.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేయగా, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ కొత్త రికార్డు (New Record) నెలకొల్పాడు. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన గ్రీన్ కోసం కేకేఆర్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తీవ్ర పోటీ పడ్డాయి. చివరకు అత్యధిక ధరకు కేకేఆర్ అతడిని తమ జట్టులోకి తీసుకుంది.

సెట్–1 బ్యాటర్ల విభాగంలో గ్రీన్ వేలం ప్రారంభమవగా, ముందుగా ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. ఆ వెంటనే రాజస్థాన్ రాయల్స్ పోటీకి దిగింది. రూ.2.80 కోట్ల వద్ద కోల్‌కతా నైట్ రైడర్స్ రంగంలోకి రావడంతో ముంబై వేలం నుంచి తప్పుకుంది. అనంతరం రాజస్థాన్–కోల్‌కతాల మధ్య పోటీ కొనసాగగా, రూ.13.60 కోట్ల వద్ద రాజస్థాన్ వెనక్కి తగ్గింది. ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ రేసులోకి రావడంతో చెన్నై–కోల్‌కతాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు ధర రూ.25.20 కోట్లకు చేరగా, చెన్నై తప్పుకోవడంతో గ్రీన్ కేకేఆర్‌కు దక్కాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కేకేఆర్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ వేలాల్లో ఇప్పటివరకు అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ పేరిట ఉండేది. 2024లో స్టార్క్‌ను కేకేఆర్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేయగా, అదే ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ పాట్ కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్లకు దక్కించుకుంది. మొత్తం ఐపీఎల్ చరిత్రలో గ్రీన్ మూడో అత్యధిక ధర పలికిన ఆటగాడు కాగా, రిషభ్ పంత్ (రూ.27 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు) అతడికి ముందున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment