రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Sircilla District) నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్(BRS) సర్పంచులతో (Sarpanches) జరిగిన ఆత్మీయ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచులకు దిశానిర్దేశం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత ముఖ్యమో, గ్రామానికి సర్పంచ్ కూడా అంతే కీలకమని అన్నారు. సర్పంచులు పూర్తిస్థాయి స్వతంత్రులని, ఎమ్మెల్యేలు బెదిరించినా భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రెండేళ్ల పాలనలో హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించిన కేటీఆర్, రెండు దశల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని తెలిపారు. మళ్లీ వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు కొనసాగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధికి వచ్చే నిధులను ఎవ్వరూ ఆపలేరని, సర్పంచులు ప్రజల సేవకు అంకితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.








