స్మృతి మంధాన పెళ్లి ఎందుకు రద్దు?

స్మృతి మంధాన పెళ్లి ఎందుకు రద్దు?

టీమిండియా (Team India) స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం అనూహ్యంగా రద్దైన విషయం తెలిసిందే. నవంబర్ 23న సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ (Palash Muchhal)తో ఆమె వివాహం జరగాల్సి ఉండగా, చివరి క్షణాల్లో అది వాయిదా (Postponed) పడింది. స్మృతి తండ్రి ఆరోగ్యం క్షీణించడమే కారణమని, అలాగే పలాష్ కూడా అనారోగ్యానికి గురయ్యాడని కొన్ని వార్తలు వచ్చాయి. డిసెంబర్ 7న వివాహం జరుగుతుందనగా… అదే రోజు మధ్యాహ్నం స్మృతి అధికారికంగా పెళ్లి రద్దు (Marriage Cancel) చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది.

వివాహం ఎందుకు రద్దు అయిందన్న విషయాన్ని స్మృతి ఎక్కడా వెల్లడించలేదు. అయితే, పెళ్లి వాయిదా పడ్డ రోజునుంచి సోషల్ మీడియాలో పలాష్‌కు సంబంధించిన కొన్ని చాట్ స్క్రీన్‌షాట్‌లు, వదంతులు తీవ్రమయ్యాయి. ఇవే అసలు కారణమన్న వార్తలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో సాంగ్లిలో పెళ్లికి ముందు రోజు జరిగిన సంఘటన గురించి కూడా కొన్ని షాకింగ్ కథనాలు ఆన్‌లైన్‌లో ప్రచారం అయ్యాయి.

సోషల్ మీడియాలో వచ్చిన ఈ వాదనల ప్రకారం, పెళ్లికి ముందు రోజు రాత్రి పలాష్ ఒక మహిళతో సన్నిహితంగా కనిపించినట్లు టీమిండియా క్రికెటర్ శ్రేయంకా పాటిల్ (Shreyanka Patil) చూశారని, ఆమె వెంటనే స్మృతికి చెప్పిందని కథనాలు చెబుతున్నాయి. తర్వాత స్మృతి కూడా పరిస్థితి గమనించగా, కుటుంబ సభ్యుల మధ్య తగాదా జరిగిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తదుపరి రోజు పెళ్లి వాయిదా పడటానికి “ఆరోగ్య కారణాలు” చెప్పారని, పలాష్ ఈ విషయంపై తనను రక్షించుకోవడానికి పీఆర్ సహాయం తీసుకున్నాడని కూడా కొన్ని సోషల్ మీడియాలో ప్రసారమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment