ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ స్కీమ్ ప్రకటన

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ స్కీమ్ ప్రకటన

అమెరికా పౌరసత్వం (US Citizenship) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. అగ్రరాజ్యం కొత్తగా ప్రవేశపెట్టిన ‘గోల్డ్ కార్డ్’ (Gold Card) కార్యక్రమం ద్వారా నేరుగా పౌరసత్వం పొందే అవకాశం కల్పిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఈ స్కీమ్ కింద 1 మిలియన్ డాలర్లు చెల్లిస్తే, అమెరికా పౌరసత్వం పాటు స్థిర నివాస హక్కు కూడా నేరుగా లభించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.

వైట్‌హౌస్‌ (White House)లోని రూజ్‌వెల్ట్ రూమ్‌ (Roosevelt Room)లో వ్యాపారవేత్తలతో సమావేశం సందర్భంగా ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని, అంతేకాదు గోల్డ్ కార్డుల ద్వారా వచ్చే సమష్టి ఆదాయం నేరుగా అమెరికా ప్రభుత్వ ఖజానాలోకి చేరుతుందని ట్రంప్ పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు సంపన్నులకు “గోల్డెన్ వీసాలు” (Golden Visas) అందిస్తున్నాయి. యుకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాల జాబితాలో ఇప్పుడు అమెరికా కూడా చేరింది. తాజా కార్యక్రమం ద్వారా చైనా, భారతదేశం, ఫ్రాన్స్ వంటి దేశాల పెట్టుబడిదారులు, ప్రతిభావంతులు పెద్ద ఎత్తున గోల్డ్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment