అమెరికా (America) ఫ్లోరిడా (Florida) రాష్ట్రం బ్రెవార్డ్ కౌంటీలో (Brevard County) ప్రమాదం చోటుచేసుకుంది. ఇంజిన్ సమస్య తలెత్తడంతో ఒక చిన్న విమానం (Small Airplane) I-95 హైవేపై (Highway) అత్యవసరంగా ల్యాండింగ్ (Landing) చేయడానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో విమానం రహదారి (Roadపై ప్రయాణిస్తున్న కారు(Car)ను ఢీకొట్టింది.
స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 57 ఏళ్ల మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. విమానంలో ఉన్న పైలట్, మరో ప్రయాణికుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
విమానం ఢీకొన్న ప్రభావంతో హైవేలో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. అధికారులు వెంటనే రహదారిని తాత్కాలికంగా మూసివేసి, విమానం మరియు దెబ్బతిన్న వాహనాలను తొలగించే పనులు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది.








