నారాయణ హాస్టల్‌లో దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నారాయణ స్కూల్ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. హయత్ నగర్ నేతాజీ బ్రాంచ్‌లో 7వ తరగతి చదువుతున్న లోహిత్‌రెడ్డి హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విద్యార్థి మృతిపై నారాయణ హాస్టల్ యాజమాన్యం పొంతనలేని సమాధానం చెబుతోందని పోలీసులు తెలిపారు. విద్యార్థి మృతిపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హాస్టల్ ఎదుట మృతుడి కుటుంబీకులు, బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థి లోహిత్‌రెడ్డి మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.







