జ‌గ‌నే మేలు.. మారుతున్న‌ ఉద్యోగుల స్వ‌రం!!

జ‌గ‌నే మేలు.. మారుతున్న‌ ఉద్యోగుల స్వ‌రం!!

కూటమి ప్రభుత్వం (Coalition Government)పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees) స్వరం 18 నెలల పాలనలోనే మారుతోంది. ఒకపక్క 1వ తేదీన జీతాల సమస్య (Salary Issue on the 1st of Every Month). మరో వైపు పీఆర్సీ బ‌కాయిలు, పెండింగ్ డీఏలు(DA), జీపీఎఫ్‌లు (GPF), ఏపీజీఎల్ఐలు (APGLI), మెడిక‌ల్ రీయింబ‌ర్స్‌మెంట్లు (Medical Reimbursements), స‌రెండ‌ర్ లీవ్స్ (Surrender Leaves) వంటి సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల స్వరం క్రమంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్, ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చిన వైఎస్ జగనే (YS Jagan – former CM) మేలనే అభిప్రాయం ఆయా ఉద్యోగ సంఘాల్లో వినిపిస్తున్నట్లుగా సమాచారం.

ప్ర‌తి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామ‌న్న కూటమి ప్ర‌భుత్వ హామీ మూన్నాళ్ల ముచ్చ‌టే అయ్యిందంటున్నారు ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక శాఖలకు చెందిన లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు నెల జీతం ఇంకా అంద‌లేదు. ఈనెల 8వ తేదీ దాటినా జీతాలు అందకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 1వ తేదీనే జీతాలు విడుదల చేస్తామన్న కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినా, నేటికీ అనేక శాఖల ఉద్యోగులు జీతం అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నెలనెలా జీతాల ఆలస్యం ఓవైపు, తమకు పెండింగ్ అరియర్స్ రూపేణా రావాల్సిన రూ.31 వేల కోట్ల బకాయిలు మరోవైపుతో ఉద్యోగులు సతమతమవుతున్నట్లుగా సమాచారం.

విడతల వారీగా చెల్లింపులు, ఉద్యోగుల్లో అసంతృప్తి
ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీతాలను విడతల వారీగా చెల్లించే పద్ధతి కొనసాగుతుండడం ఉద్యోగుల్లో అసహనానికి దారితీస్తోంది. ఈ నెలలోనూ ప్రభుత్వం సుమారు రూ.3,000 కోట్లు అప్పును రిజ‌ర్వ్ బ్యాంక్ నుంచి స‌మీక‌రించింది. రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చినా, పలు శాఖలకు జీతాలు విడుదల కాలేదు. దీంతో ఆయా శాఖల ఉద్యోగుల నుంచి ప్రభుత్వంపై విస్మయం వ్యక్తం అవుతోంది.

జీతాలు అందని ప్రధాన శాఖలు
ప్రస్తుతం జీతాలు అందని విభాగాల‌ల్లో సోషల్ వెల్ఫేర్, పంచాయతీ రాజ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ (R&B), పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్ ఈ విభాగాల్లోనే సుమారు లక్ష మంది ఉద్యోగులు వేతనాలు కోసం ఎదురుచూస్తున్నట్లుగా స‌మాచారం. జీతాలు లేట్ కావడంతో EMIలు, పిల్లల స్కూల్ ఫీజులు, గృహ వ్యయాలు వంటి విషయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు.

కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్, పెన్ష‌న్ల‌కు మరింత దెబ్బ
అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఈ నెల కూడా జీతం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రతి నెల ఇదే పరిస్థితి మారకుండా కొనసాగుతుండడం వారి ఆర్థిక స్థితిని మరింత దెబ్బతీస్తోంది. పెన్షనర్లు కూడా ప్రతి నెల జీతం చెల్లింపు ఆలస్యంతోనే జీవనం సాగించాల్సి వస్తోంది. వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. “ప్రతి నెల ఇదే కథ. ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి. 1వ తేదీ హామీలు ఇచ్చినా అమలు లేదు. లోన్ EMI లు, ఫీజులు, ఖర్చులకు నరకయాతన పడుతున్నాం” అని ఈ నెల జీతాల చెల్లింపుపై ఉద్యోగులు ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పెండింగ్ అరియర్స్ విషయం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment