దర్శనానికి వెళ్తూ విషాదం.. విశాఖ అయ్యప్ప భక్తులు మృతి

దర్శనానికి వెళ్తూ విషాదం.. విశాఖ అయ్యప్ప భక్తులు మృతి

తమిళనాడులో జ‌రిగిన‌ ఘోర రోడ్డు ప్రమాదం ఏపీకి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రామనాథపురం జిల్లా కీళకరై పోలీస్ స్టేషన్ సమీపంలో రెండు కార్లు ఢీకొనడంతో విశాఖ–విజయనగరం ప్రాంతాలకు చెందిన అయ్యప్ప భక్తులు మృతిచెందిన ఘటన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.

వివ‌రాల్లోకి వెళితే.. రామేశ్వరం దర్శనం కోసం వెళ్తున్న అయ్యప్ప భక్తులతో ఉన్న మారుతి విసా కారును, కీళకరై నుంచి ఎర్వడి వైపు వస్తున్న కియా కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అతివేగంతో రెండు కార్లూ ఢీకొన‌డంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోవ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మొత్తం 5 మంది మృతి చెందగా, 7 మందికి పైగా తీవ్ర గాయాలతో రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.

మృతులంతా ఉత్తరాంధ్ర వాసులుగా గుర్తించారు. వారిలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన అయ్యప్ప భక్తులు ఉన్నట్లు సమాచారం. శబరిమల దర్శనం ముగించుకుని రామేశ్వరం వైపు తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకోవడం విషాదాన్ని మరింత పెంచింది. మరణించిన వారిలో కార్ డ్రైవర్ ముస్తాక్ కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన కీళకరై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా మృతుల కుటుంబాల్లో శోకసంద్రం నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment