పాండ్యా.. పవర్ రీలోడెడ్

పాండ్యా పవర్ రీలోడెడ్

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), ఆసియా కప్ (Asia Cup) సూపర్‌4లో శ్రీలంక (Sri Lanka)తో జరిగిన మ్యాచ్ సందర్భంగా గాయపడిన తర్వాత, తాజాగా ఫిట్‌నెస్ సాధించి క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy)తో రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్, తన ఫస్ట్ మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో మంగళవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరోడా జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.

పంజాబ్ జట్టు (Punjab Team) నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, బరోడా ఈ టార్గెట్‌ను కేవలం 19.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా (77*; 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. బరోడా బ్యాటింగ్‌లో ఓపెనర్లు విష్ణు సోలంకి (43) మరియు శాశ్వత్ రావత్ (31) అదిరే ఆరంభాన్ని ఇవ్వగా, వన్‌డౌన్ బ్యాటర్ శివాలిక్ వర్మ (47) కూడా రాణించాడు.

పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ (50), అన్మోల్‌ప్రీత్ సింగ్ (69)లు సూపర్ బ్యాటింగ్‌తో అలరించారు. బౌలింగ్‌లో ఒక వికెట్ తీసి, ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. ఈ అద్భుతమైన ఫామ్‌తో హార్దిక్ పాండ్యా డిసెంబర్ 9 నుంచి సౌతాఫ్రికాతో మొదలుకానున్న టీ20 సిరీస్‌కు పూర్తి ఉత్సాహంతో సిద్ధమవుతున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment