విజయ్ దివస్.. సైనికుల ధైర్యానికి సెల్యూట్

విజయ్ దివస్.. సైనికుల ధైర్యానికి సెల్యూట్

ప్రతీ ఏడాది డిసెంబర్ 16న జరుపుకునే విజయ్ దివస్, 1971లో జరిగిన చారిత్రక భారత విజయానికి నివాళిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భారత సాయుధ బలగాల ధైర్యం, త్యాగాలను స్మరించారు.

వైఎస్ జగన్ ట్వీట్
విజయ్ దివస్ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు.. “విజయ్ దివస్ సందర్భంగా మన సాయుధ బలగాల ధైర్యసాహసాలు, త్యాగాలను స్మరించుకుని, సెల్యూట్ చేద్దాం. 1971లో జరిగిన చారిత్రక విజయంలో మన సైనికులు చూపిన పరాక్రమం ఎనలేనిది. ఈ చరిత్రక గర్వానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది” అని ట్వీట్ చేశారు.

విజయ్ దివస్ ద్వారా మన సైనికుల త్యాగాలను గుర్తించడమే కాకుండా, దేశ రక్షణ కోసం వారి పాత్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలియజేస్తుంది. ఈరోజు భారత సైనికుల శౌర్యానికి ఒక జ్ఞాపకార్థంగా నిలుస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment