చ‌డ్డీ గ్యాంగ్ త‌ర‌హాలో లేడీ గ్యాంగ్.. విజ‌య‌వాడ‌లో హ‌ల్‌చ‌ల్‌

చ‌డ్డీ గ్యాంగ్ త‌ర‌హాలో లేడీ గ్యాంగ్.. విజ‌య‌వాడ‌లో అర్ధ‌రాత్రి చోరీలు

విజయవాడ (Vijayawada) నగరంలోని చౌకీ సెంటర్ (Chowki Center) పరిసరాల్లో లేడీ గ్యాంగ్ (Lady Gang) దోపిడీలు పెచ్చరిల్లడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అర్ధ‌రాత్రి తరువాత ఈ గ్యాంగ్ వరుసగా దుకాణాల్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతూ మార్కెట్ ప్రాంతంలో భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తోంది.

గత కొన్ని రోజులుగా శ్రీ లక్ష్మీ గణపతి కెమికల్స్‌ (Sri Lakshmi Ganapathi Chemicals)‌తో పాటు సమీపంలోని పలు దుకాణాల్లో పెద్ద మొత్తంలో స్టాక్ కనిపించకపోవడంతో వ్యాపారులు నష్టపోయినట్లు తెలిసింది. దీనిపై అనుమానం కలిగిన కెమికల్స్ షాప్ యజమాని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో సంచలన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

సీసీ ఫుటేజ్‌లో బట్టబయలైన లేడీ గ్యాంగ్
సీసీ ఫుటేజ్‌లో రాత్రివేళ లేడీ గ్యాంగ్ సభ్యులు దుకాణంలోకి చొరబడి స్టాక్ దొంగిలిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. వెంటనే షాప్ యజమాని ఈ వీడియోలను ఆధారంగా చేసుకుని విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గ్యాంగ్ సభ్యులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు నియమించబడ్డాయి. చౌకీ సెంటర్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తూ, వరుస దొంగతనాలకు కారణమైన ఈ లేడీ గ్యాంగ్‌ను త్వరితగతిన పట్టుకునేందుకు పోలీసులు చర్యలు వేగవంతం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment