ఐబొమ్మ రవి కస్టడీ విచారణ.. 21,000 పైగా సినిమాలు పైరసీ!

ఐబొమ్మ రవి కస్టడీ విచారణ.. 21,000 పైగా సినిమాలు పైరసీ!

హైదరాబాద్ (Hyderabad) సైబర్ క్రైమ్ టీమ్ (Cyber Crime Team), ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడిగా భావిస్తున్న ఐబొమ్మ రవి (iBomma Ravi)పై మరో విడత కఠిన కస్టడీ విచారణ చేపట్టింది. ఈ విచారణలో రవి తన మెయిల్ ఖాతాలను ఎలా రిట్రైవ్ చేశాడో పోలీసులకు వివరించాడు. ఐబొమ్మ, బప్పం వంటి వెబ్‌సైట్‌లలో 21,000కి పైగా సినిమాలు పైరసీ చేయబడినట్లు పోలీసులు గుర్తించారు.

రవి కేవలం పైరసీ వెబ్‌సైట్ల నుండి సినిమాలను రికార్డింగ్ చేయడమే కాకుండా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలైన సినిమాలను కూడా కాపీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. రికార్డింగ్ చేసిన ఈ సినిమాల ఆడియో, వీడియో నాణ్యతను పెంచేందుకు, రవి ఏకంగా కరేబియన్ దీవుల్లోని ఔట్‌సోర్సింగ్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పోలీసులకు వెల్లడించాడు.

విచారణ సందర్భంగా రవి, పైరసీలో ఉపయోగించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ మరియు తన వెబ్‌సైట్ల నిర్వహణకు సంబంధించిన వివరాలను పోలీసులకు అందించాడు. ‘ఐబొమ్మ’ పూర్తి పేరు “ఇంటర్నెట్ బొమ్మ” అని, విశాఖపట్నం ప్రాంతంలో సినిమాలను ‘బొమ్మ’గా పిలిచేవారని, అందుకే ఈ పేరు పెట్టానని తెలిపాడు. మరో వెబ్‌సైట్‌కు “బలపం” అనే పేరు పెట్టాలని అనుకున్నప్పటికీ, డొమైన్ సమస్యల కారణంగా ‘L’ అక్షరాన్ని తొలగించి “బప్పం” గా మార్చినట్లు వివరించాడు. అంతేకాకుండా, తాను అప్‌లోడ్ చేసిన సినిమాలన్నీ ప్రధానంగా టెలిగ్రామ్ గ్రూపుల నుండి సేకరించినవే అని కూడా రవి పోలీసుల విచారణలో స్పష్టం చేశాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment