స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో విడాకుల అనంతరం పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో ప్రశాంత జీవితం గడుపుతూ, ఎన్జీవో ద్వారా మూగ జీవాల సంరక్షణలో చురుగ్గా ఉంటున్న రేణు, సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటారు.
అయితే తాజాగా, ఆమె ‘పదహారు రోజుల పండుగ’ అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాయికృష్ణ దమ్మాలపాటి హీరోగా, ఉద్యన్ హీరోయిన్గా, సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, కృష్ణుడు, విష్ణు వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో ఊహించని సంఘటన జరిగింది. ఈ వేడుకకు హాజరైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రేణు దేశాయ్‌ను చూడగానే “వదిన” అని సంబోధించారు. దీనికి రేణు వెంటనే స్పందిస్తూ, జానీ మాస్టర్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. “నీకు ఎన్నిసార్లు చెప్పాలి వదిన అని పిలవద్దు, అక్క అని పిలువు” అంటూ గట్టిగా చెప్పారు. దీంతో జానీ మాస్టర్ వెంటనే ఆమెకు నమస్కారం చేసి, పక్కనే ఉన్న అనసూయ భరద్వాజ్‌ను పలకరించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, రేణు దేశాయ్ సంప్రదాయాలు, కట్టుబాట్లకు ఇచ్చే విలువను ఈ సంఘటన మరోసారి తెలియజేసింది.








