---Advertisement---

జ‌న‌సేన‌లోకి మంచు మనోజ్, మౌనిక రెడ్డి?

జ‌న‌సేన‌లోకి మంచు మనోజ్, మౌనిక రెడ్డి?
---Advertisement---

ఇటీవ‌ల మంచు ఫ్యామిలీ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. కుటుంబ‌ త‌గాదాలు, జ‌ర్న‌లిస్టుపై దాడి నేప‌థ్యంలో గ‌త మూడు రోజులుగా వార్త‌ల్లో నిలిచి మంచు ఫ్యామిలీ నుంచి తాజా అప్డేట్ వ‌చ్చింది. మంచు మనోజ్, మౌనిక రెడ్డి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌కి చెందిన జనసేన పార్టీలో వీరిద్ద‌రూ చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీవార్త తెలుగునాట హాట్ టాపిక్‌గా మారింది.

ఆస్తి వివాదాలపై రాజకీయ ఆరంగేట్రం
మంచు సోదరుల మధ్య జరుగుతున్న ఆస్తి వివాదం, ఇటీవల మనోజ్ కుటుంబంలో జరిగిన వివాదం, ఈ ఫ్యామిలీకి చెందిన ప్రజలపై ఎన్నో ప్రశ్నలను రేకెత్తించినప్పటికీ, ఇప్పుడు మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి జనసేనలో చేరడం అనే కీలక నిర్ణయం తీసుకున్నాడు.

ప్రత్యేక దృష్టి..
నేడు ఆళ్ల‌గడ్డలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొని పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు వీరిద్దరూ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అక్కడ భూమా దంపతుల ఘాట్‌లో పొలిటిక‌ల్ ఎంట్రీపై ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ మార్పులు చివ‌ర‌కు ఎటుచేర‌నున్నాయో వేచిచూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment