అమరావతి (Amaravati) పరిధిలోని వెంకటపాలెం (Venkatapalem)లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ (Sri Venkateswara Swamy Temple) విస్తరణ పనులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గురువారం భూమిపూజ (Groundbreaking Ceremony) నిర్వహించారు. మొత్తం రూ.260 కోట్ల వ్యయంతో రెండు దశల్లో చేపట్టనున్న ఈ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అయితే ఈ పవిత్ర కార్యక్రమంలో సీఎం చేసిన రాజకీయ వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. మొన్న జరిగిన చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) సభలో నైతిక విలువల గురించి ప్రసంగాలు చేసి.. ఆలయంలో ఇవాళ రాజకీయాలు మాట్లాడడం ఏం నైతికత అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. “పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప మంచి చేయలేదు” అని, వైసీపీ(YSRCP)పై తీవ్ర విమర్శలు చేశారు. “అమరావతి రైతులు (Amaravati Farmers) మంచి సంకల్పంతో భూములు ఇచ్చారు.. కానీ గత ప్రభుత్వం రైతులను నరకం చూపించింది. 2019లోనే ఆలయాన్ని నిర్మించే సమయంలో ‘అమరావతి'(Amaravati) అనే పేరు పెట్టాలనే సంకల్పం వేంకటేశ్వరుడే ఇచ్చారు. వెంకటేశ్వరుడి సన్నిధిని ఎప్పటికీ అపవిత్రం అయ్యేలా చేయను” అంటూ వ్యాఖ్యానించారు.
ఆలయంలో రాజకీయ వ్యాఖ్యలు.. వివాదం
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జరిగిన శ్రీ కనకదుర్గమ్మ (Sri Kanaka Durga) శరన్నవరాత్రి కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు రాజకీయ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమరావతి ఆలయంలోనూ విమర్శలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొంది. ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, సీఎం స్థాయి వ్యక్తి మాటలు విని నివ్వెరపోతున్నారు. పవిత్ర వేదికలలో రాజకీయ విమర్శలు చేయడం సముచితం కాదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. సీఎం మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.








