ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మద్యం కేసు (Liquor Case)లో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప (Balaji Govindappa), ధనుంజయరెడ్డి (Dhanunjaya Reddy), కృష్ణమోహన్ రెడ్డి (Krishnamohan Reddy)లకు సుప్రీంకోర్టు (Supreme Court) పెద్ద ఉపశమనం ఇచ్చింది. డిఫాల్ట్ బెయిల్ (Default Bail) రద్దు చేస్తున్న ఏపీ హైకోర్టు (AP High Court) తీర్పును సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులు కోర్టులో హాజరుకావాల్సిన సరెండర్ బాధ్యత నుంచి తాత్కాలికంగా మినహాయింపు మంజూరు చేసింది.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు, నిందితులకు ట్రయల్ కోర్టు తగిన షరతులు విధించాలని స్పష్టం చేసింది. హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయడం సరైందా కాదా అన్న విషయంపై సమగ్రంగా పరిశీలన అవసరమని, అప్పటి వరకు నిందితులపై బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు సూచించింది. దీంతో కేసులో నిందితులకు తాత్కాలిక రక్షణ లభించినట్లైంది.
డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసిన హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి కౌంటర్‌ను పది రోజుల్లోగా దాఖలు చేయాలని SITను ఆదేశించింది.
ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి ధర్మాసనం విచారించింది. నిందితుల తరఫున న్యాయవాదులు హైకోర్టు తీర్పు చట్టపరమైన ప్రమాణాలకు వ్యతిరేకమని వాదించగా, SIT తరఫున సీరియస్ అవకతవకలను వివరించారు. చివరకు, తదుపరి విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ 15కు వాయిదా వేసింది.








