ఏఆర్ రెహమాన్ రెండు పాటలు, 20 కోట్ల వ్యూస్! సోషల్ మీడియా షేక్!

ఏఆర్ రెహమాన్ రెండు పాటలు, 20 కోట్ల వ్యూస్! సోషల్ మీడియా షేక్!

‘తేరీ ఇష్క్ మే’ టైటిల్ సాంగ్ సంచలనం
ధనుష్ (Dhanush), ఆనంద్ ఎల్. రాయ్ (Aanand L. Rai) కాంబినేషన్‌లో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ స్టోరీ ‘తేరీ ఇష్క్ మే (Teri Ishq Mein)’ (తెలుగులో ‘అమర కావ్యంగా’ (Amara Kaavyanga) రాబోతోంది). కృతి సనన్ (Kriti Sanon) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కానుంది. ఈ సినిమాకు రెహమాన్ అందించిన టైటిల్ సాంగ్ విడుదలైన కేవలం మూడు వారాల్లోనే 10 కోట్ల (100 మిలియన్) వ్యూస్ దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో రెహమాన్ (A.R. Rahman) సంగీతం అందించిన ఏ పాటకు ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో వ్యూస్ దక్కలేదు. గతంలో ధనుష్ నటించిన ‘రంఝానా’, ‘మారియన్’, ‘రాయన్’ చిత్రాలకు కూడా రెహమానే సంగీతమందించారు.

చికిరి సాంగ్ హవా
షెడ్యూల్ ప్రకారం రెహమాన్ మ్యూజిక్ వర్క్‌ను పూర్తి చేయరనే రూమర్స్ టాలీవుడ్‌లో గట్టిగా ఉన్న కారణంగా స్టార్ మేకర్స్ ఆయన జోలికి త్వరగా పోరు. కానీ, ఈ విషయంలో బుచ్చిబాబు సానా సాహసం చేశారు. అయితే, పాటలు, ట్యూన్స్‌ విషయంలో బుచ్చిబాబు పడిన టెన్షన్‌ను స్టార్ కంపోజర్ కేవలం ‘చికిరి’ పాటతో ఒక్కసారిగా కూల్ చేసేశారు.

ఈ పాట సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. దేశ సరిహద్దులు దాటి ఖండాంతరాలకు పాకిపోయింది. ఎక్కడ చూసినా, సోషల్ మీడియా ఓపెన్ చేసినా ‘చికిరి’ మేనియాతోనే మూవీ లవర్స్ ఊగిపోతున్నారు. ఈ పాట విడుదలైన రెండు వారాలు దాటినా కూడా టాప్ 5 చార్ట్‌లో స్థానం నిలుపుకుంది. ఈ సింగిల్ అన్ని భాషల్లో కలిపి 10 కోట్ల (100 మిలియన్) వ్యూస్ క్రాస్ చేసి చార్ట్ బస్టర్‌గా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment