తెలంగాణ (Telangana)లో గడచిన మూడు నెలలుగా NHM కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు అందించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎన్హెచ్ఎం ఉద్యోగులు (NHM Employees) ఆందోళన చేపట్టారు.
గతంలో “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy)ని చూసి చెప్పులు ఎత్తుకుపోతాడు అనుకున్నట్లు.. మమ్మల్ని చూసి అప్పు ఇచ్చేవాళ్లు కూడా అలాగే అనుకుంటున్నారు” అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఆశ పెట్టుకుని సేవ చేస్తున్నప్పటికీ, కనీస జీవనోపాధికి కావాల్సిన జీతం కూడా ఇవ్వకపోవడం ఘోర అన్యాయం అని ఉద్యోగులు అంటున్నారు.
“కంచెలు బద్దలు కొట్టినం అని చెప్పే ప్రభుత్వం.. మేము జీతాలు అడగడానికి వస్తే కంచెలు వేసి అడ్డుకుంటోంది” అని వారు ఆరోపించారు. బస్సు సౌకర్యం కూడా లేని 70–80 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు వెళ్లి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని, అలాంటి సిబ్బందికే జీతాలు లేకుండాపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు. పర్వాలేదనుకుంటూ పల్లె పల్లె తిరిగి సేవ చేసే మాకే ఈ నిర్లక్ష్యం ఎందని ప్రశ్నించారు.
“చాయ్ (Tea) తాగే సమయంలో మా సమస్యలు పరిష్కరిస్తాం అన్నారు… మరి ఆ చాయ్ ఎప్పుడు తాగుతారు?” అని ప్రభుత్వం చేసిన హామీలు ఎక్కడికి పోయాయో ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ముందు వరుసలో నిలిచే NHM సిబ్బందికి వెంటనే బకాయిలు చెల్లించి, సేవల్లో అంతరాయం లేకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.








“చంద్రబాబుపై ప్రకృతి తిరగబడుతుంది” – పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు