కేటీఆర్‌కు షాక్.. విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!

కేటీఆర్‌కు బిగ్‌ షాక్ – విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!

బీఆర్‌ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR)కు ఫార్ములా-ఈ కార్ (Formula-E Car) రేసు కేసు(Case)లో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసులో ఆయనపై విచారణ కొనసాగించేందుకు తెలంగాణ (Telangana) గవర్నర్ (Governor) జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) తాజాగా అధికారికంగా అనుమతి మంజూరు చేశారు.

రూ.54.88 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలకు సంబంధించిన ఈ కేసులో కేటీఆర్‌ను ఏ-1గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ (Aravind Kumar)ను ఏ-2గా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)(ACB) పేర్కొంది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గవర్నర్ ఈ గ్రీన్‌సిగ్నల్ (Green Signal) ఇవ్వడంతో, త్వరలోనే ఏసీబీ ఆయనపై చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా కేటీఆర్ నాలుగుసార్లు ఏసీబీ ఎదుట హాజరయ్యారు.

గవర్నర్ అనుమతి లభించడంతో, ఈ కేసు విచారణ కీలక మలుపు తిరగనుంది. 2024 డిసెంబర్‌లో నమోదైన ఈ కేసులో, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదు మేరకు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని ఏసీబీ తేల్చింది.

ఏసీబీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరిన తర్వాతే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చార్జ్‌షీట్ దాఖలుకు ముందు ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్‌తో పాటు ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయ, పరిపాలనా వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment