ఆస్తుల కేసు విచారణ (Assets Case Inquiry)లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు నాంపల్లి సీబీఐ కోర్టు (Nampally CBI Court)కు హాజరయ్యారు. దాదాపు ఐదేళ్ల తర్వాత (చివరిసారిగా 2020 జనవరి 10న) కోర్టు ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగతంగా హాజరు నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయం (Begumpet Airport) వద్ద భారీగా జనసంద్రం కనిపించింది.
వైసీపీ శ్రేణులు (YSRCP cadre), అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి, జగన్(Jagan)కు ఘన స్వాగతం పలికారు. బేగంపేట (Begumpet) నుంచి నాంపల్లి కోర్టు (Nampally Court) వరకు దారి పొడవునా బైక్ ర్యాలీ చేపట్టారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, బైకుల ర్యాలీలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకోవడంతో బేగంపేట ప్రాంతం నినాదాలతో దద్దరిల్లింది.
ఈ కీలకమైన విచారణ నేపథ్యంలో, 11 ఛార్జ్ షీట్లలో భాగంగా జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలలో అధికారులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 30 నిమిషాల విచారణ అనంతరం నాంపల్లి కోర్టు నుంచి వైఎస్ జగన్ బయల్దేరారు. కోర్టు నుంచి నేరుగా లోటస్పాండ్ (Lotus Pond)లోని తన నివాసానికి వెళ్లనున్నారు. జగన్ వెళ్లే మూడు రూట్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.









