‘లవ్ మ్యారేజ్’ చేసుకుంటా: భాగ్యశ్రీ బోర్సే

‘లవ్ మ్యారేజ్’ చేసుకుంటా: భాగ్యశ్రీ బోర్సే

పూణే సుందరి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) తన పెళ్లి విషయంపై తాజాగా చాలా ఓపెన్‌గా స్పందించింది. ఇప్పటివరకు తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా మాట్లాడని ఈ నటి, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు బోల్డ్ అండ్ క్లియర్ సమాధానం ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. యాంకర్ “లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేక అరేంజ్ మ్యారేజ్?” అని అడగ్గా, భాగ్యశ్రీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా “నేను కచ్చితంగా లవ్ మ్యారేజ్ (Love Marriage) చేసుకుంటా” అని స్పష్టం చేసింది.

అయితే, ప్రస్తుతం లవ్‌లో ఉన్నారా అనే ప్రశ్నకు మాత్రం ఆమె “ప్రస్తుతం లవ్‌లో లేను” అని సింపుల్‌గా బదులిచ్చింది. అప్పుడు యాంకర్ “లవ్‌లో లేకపోయినా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని ఎలా చెప్తున్నారు?” అని అడగ్గా, భాగ్యశ్రీ ఇచ్చిన సమాధానం చాలామందిని ఆకట్టుకుంది. “నాకు ప్రేమపై నమ్మకం ఉంది. నాకు నచ్చే, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి నా జీవితంలోకి తప్పకుండా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ నేను మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటా, ఇది ఫిక్స్” అని ఆమె నమ్మకంగా చెప్పింది.

రామ్‌ (Ram)తో కలిసి భాగ్యశ్రీ నటించిన తాజా చిత్రం ‘ఆంధ్రకింగ్’ (Andhra King) ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఆమె ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రామ్ సరసన ఫ్రెష్ పెయిర్‌గా కనిపిస్తున్న భాగ్యశ్రీ, ఈ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తోంది. ప్రస్తుతం ఆమె పెళ్లి గురించి చెప్పిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment