టీమిండియా (Team India) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఆసుపత్రి (Hospital) నుంచి డిశ్చార్జ్ (Discharged) అయ్యారు. సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో మెడ గాయం కారణంగా ఆయన బ్యాటింగ్‌కు రాలేకపోయారు. శనివారం గాయపడిన గిల్‌ను మొదట ICUలో ఉంచగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, నడవగలుగుతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే CAB అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసుపత్రిలో ఆయన్ను పరామర్శించారు.
గిల్ పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తున్నప్పటికీ, నవంబర్ 22 నుంచి గౌహతిలో ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కు గిల్ ఆడతాడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, గిల్ పరిస్థితిపై ఫిజియోల తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాగా, గిల్ లేకపోవడంతో తొలి టెస్ట్‌లో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది.








