టీమిండియా (Team India) వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) దేశవాళీ టోర్నీలైన విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) లేదా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy)లో ముంబై (Mumbai) తరఫున ఆడటానికి సిద్ధమవుతున్నాడన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌కు సన్నాహకంగా రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలపై తాజాగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ స్పందించారు. ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆయన కొట్టిపారేశారు.
విజయ్ హజారే లేదా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో ఆడాలన్న విషయాన్ని రోహిత్ తమ దృష్టికి తేలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రోహిత్ ముంబై తరఫున ఆడితే అది గొప్ప విషయమని, యువ ఆటగాళ్లకు ప్రేరణగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ జట్టులో అవకాశాలు పొందాలంటే దేశవాళీ క్రికెట్‌లో ఆడాలన్న బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్, కోచ్ గౌతమ్ గంభీర్ నియమాన్ని ఆయన స్వాగతించారు.
కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై ఇటీవలి కాలంలో చర్చలు ఎక్కువయ్యాయి. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు వన్డేల్లో కొనసాగాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ వారికి దేశవాళీ టోర్నీల్లో ఆడాలని సూచించినట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే, భవిష్యత్తుపై గందరగోళం నెలకొన్న తరుణంలోనే రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా రాణించాడు. మూడు వన్డేల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్ అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో కనిపించడం గమనార్హం.








“చంద్రబాబుపై ప్రకృతి తిరగబడుతుంది” – పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు